Get an additional ₹5,000 discount on

Tagline here

To avail this offer, get a quote in the next
04 Minutes
59 Seconds

భారతదేశంలో సౌర విద్యుత్ వృద్ధి: PV మార్కెట్, పాలసీలు, ధరలు మరియు రూఫ్‌టాప్ సోలార్ పాత్ర

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సౌర విద్యుత్ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సోలార్ అనేది ప్రభుత్వ ప్రాజెక్టులు లేదా పెద్ద సంస్థల వరకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అదే సోలార్ సాధారణ ప్రజల రోజువారీ జీవితాల్లోకి వచ్చేసింది. ఇళ్ల పైకప్పులు, అపార్ట్‌మెంట్లు, చిన్న బిజినెస్ ప్రదేశాల్లో జరుగుతున్న రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ లే ఈ మార్పుకు నిదర్శనం.

ఈ మార్పు ఒక్కసారిగా వచ్చినది కాదు. విద్యుత్ అవసరాలు పెరుగుతున్న కొద్దీ సంప్రదాయ విద్యుత్ పై ఒత్తిడి పెరగడం మొదలైంది. అదే సమయంలో విద్యుత్ ఖర్చులు పెరగడం కూడా చాలామందిని ప్రత్యామ్నాయాల వైపు చూడేలా చేసింది.

అదే సమయంలో సోలార్ చుట్టూ ఏర్పడిన అనుకూల పరిస్థితులు ఈ మార్పుకు బలంగా తోడయ్యాయి. భారతదేశ PV మార్కెట్ అభివృద్ధి, ప్రభుత్వ సోలార్ పాలసీలు, తగ్గుతున్న సోలార్ ప్యానెల్ ధరలు ఇవన్నీ కలిపి సోలార్ ను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేశాయి. అందుకే ఈ రోజు సౌర విద్యుత్ ఒక ట్రెండ్ గా కాకుండా, భారతదేశ ఎనర్జీ భవిష్యత్తులో ఒక కీలక భాగంగా మారుతోంది.

ఇప్పుడు ఈ మార్పు ఎలా చోటు చేసుకుంటోంది, ఇందులో PV మార్కెట్, ప్రభుత్వ సోలార్ పాలసీలు, ధరలు మరియు రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ పాత్ర ఏమిటో ఒక్కో అంశాన్ని సింపుల్‌గా చూద్దాం.

భారతదేశంలో PV మార్కెట్ వృద్ధి

అసలు PV మార్కెట్ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే, PV అంటే Photovoltaic. అంటే సూర్యకాంతిని నేరుగా విద్యుత్ గా మార్చే టెక్నాలజీ. PV మార్కెట్ అంటే కేవలం సౌర విద్యుత్ వాడకం మాత్రమే కాదు, ప్యానెల్స్ తయారీ నుంచి ఇన్‌స్టలేషన్, గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం వరకు మొత్తం supply chain ఇందులోకి వస్తుంది. అయితే భారతదేశ PV మార్కెట్ గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది.

ఈ వృద్ధితో పాటు మార్కెట్ లో నిర్ణయాలు తీసుకునే విధానం కూడా మారింది. మొదట్లో ధరే ప్రధాన అంశంగా ఉండేది. ఇప్పుడు మాత్రం పనితనం, లాంగ్ టర్మ్ సేవింగ్స్, మెయింటెనెన్స్ లాంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా బిజినెస్ లు తమ నెలవారీ ఖర్చులను నియంత్రించుకోవడానికి సోలార్ ను ఒక వ్యూహంగా చూస్తున్నాయి.

ఈ మార్పుల ప్రభావం మార్కెట్ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న సిస్టమ్స్ నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు డిమాండ్ వేర్వేరు స్థాయిల్లో పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో grid పరిమితంగా ఉండటంతో PV సిస్టమ్స్ కు మరింత ప్రాధాన్యం లభిస్తోంది. ఇలా భారతదేశ PV మార్కెట్ ఇప్పుడు ఒక సపోర్టింగ్ సెక్టార్ గా కాకుండా, ప్రధాన ఎనర్జీ వ్యవస్థలో భాగంగా మారింది.

భారతదేశ సోలార్ పాలసీలు

PV మార్కెట్ పెరుగుదల వెనుక టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రభుత్వ పాత్ర కూడా చాలా కీలకం. కొన్ని సంవత్సరాల ముందు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, సాధారణ ప్రజలకు కూడా సోలార్ అందుబాటులోకి  తీసుకుని రావాలనే లక్ష్యం తో పలు పాలసీలను అమల్లోకి తీసుకొచ్చాయి.

ఈ పాలసీలు అమల్లోకి వచ్చిన తర్వాత, సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం గురించి ఉన్న సందేహాలు క్రమంగా తగ్గాయి. అనుమతులు, ఖర్చులు, సపోర్ట్ లాంటి విషయాలపై స్పష్టత రావడంతో ఇళ్లు మరియు చిన్న బిజినెస్ లు కూడా సోలార్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. సబ్సిడీలు మరియు క్లియర్ మార్గదర్శకాలు ఈ నిర్ణయాన్ని మరింత సులభం చేశాయి.

ప్రత్యేకంగా రూఫ్‌టాప్ సోలార్ విషయంలో ఈ పాలసీల ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, షాపులు కూడా సోలార్ పెట్టించుకోవడం సాధ్యమైంది. నెట్ మీటరింగ్ లాంటి సదుపాయాలు ఉండటంతో, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ ను grid కి పంపే అవకాశం ఉందని తెలిసిన తర్వాత, సోలార్ ను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడటం మొదలైంది. అందుకే చాలామంది సోలార్ ని సోలార్ ను తాత్కాలిక ఎంపికగా కాకుండా, దీర్ఘకాలిక పరిష్కారంగా చూసేలా చేస్తున్నాయి.

Related Article – Difference Explained Between Net Metering Vs Gross Metering

భారతదేశంలో సోలార్ ప్యానెల్ ధరలు

మొదట్లో సోలార్ ప్యానెల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది సోలార్ పెట్టించుకోవడానికి ముందుకు రాలేదు. ఖర్చు ఎక్కువగా అనిపించడంతో ఆలోచన దశలోనే ఆగిపోయేవారు.

కానీ కాలక్రమంలో పరిస్థితి మారింది. టెక్నాలజీ మెరుగుపడటం, సోలార్ ప్యానెల్ తయారీ పెరగడం, మార్కెట్ లో పలురకాల కంపెనీలు అందుబాటులోకి రావడంతో సోలార్ ప్యానెల్ ధరలు క్రమంగా తగ్గాయి.

ప్యానెల్ ధరలు తగ్గడంతో మొత్తం సిస్టమ్ ఖర్చుపై వినియోగదారులు స్పష్టంగా ఆలోచించగలుగుతున్నారు. ప్యానెల్ ఖర్చే పెద్ద భాగం కావడంతో, దాని తగ్గుదల సోలార్ సిస్టమ్ ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరల మార్పు వల్ల సోలార్ ఇప్పుడు మరింత మంది వినియోగదారులకు సాధ్యమైన ఎంపికగా మారింది.

భారతదేశ సోలార్ తయారీ వృద్ధి

భారతదేశంలో సౌర విద్యుత్ వృద్ధి కేవలం వినియోగం వరకే పరిమితం కాలేదు. సోలార్ తయారీ రంగం కూడా గత కొన్ని సంవత్సరాల్లో బలంగా ఎదిగింది. ఇంతకు ముందు సోలార్ ప్యానెల్స్ ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. అందుకే ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది.

Make in India కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడంతో, సోలార్ తయారీ భారత్ లోనే మొదలైంది. ప్యానెల్స్, ఇన్వర్టర్లు, మౌంటింగ్ స్ట్రక్చర్లు లాంటి భాగాలు ఇప్పుడు దేశంలోనే తయారవుతున్నాయి.

దీని వల్ల సరఫరా స్థిరంగా మారింది. ధరలు అదుపులోకి వచ్చాయి. అంతేకాదు, తయారీ యూనిట్లు, అసెంబ్లీ కేంద్రాలు, సపోర్ట్ సర్వీసుల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరిగాయి. దీంతో దేశంలోనే తయారీ పెరిగి, సోలార్ రంగానికి మరింత స్థిరత్వం వచ్చింది.

భారతదేశ సోలార్ కంపెనీల పాత్ర

భారతదేశంలో సౌర విద్యుత్ వృద్ధిలో సోలార్ కంపెనీల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు ఈ రంగంలో కొద్దిమంది కంపెనీలే కనిపించేవి. ఇప్పుడు మాత్రం చిన్న స్థాయి సంస్థల నుంచి Freyr Energy లాంటి పెద్ద స్థాయి కంపెనీల వరకు చాలానే మార్కెట్ లోకి వచ్చాయి. దీనివల్ల వినియోగదారులకు ఎంపికలు పెరిగాయి, అలాగే సోలార్ వైపు చూడాలన్న ఆలోచన కూడా బలపడింది.

ఈ కంపెనీలు కేవలం సోలార్ ప్యానెల్స్ అమ్మడంపైనే దృష్టి పెట్టడం లేదు. సైట్ విజిట్ చేసి ఎంత సైజ్ సిస్టమ్ అవసరమో చెప్పడం నుంచి, డిజైన్, ఇన్‌స్టలేషన్, తరువాత మెయింటెనెన్స్ వరకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాయి. దీంతో సోలార్ పెట్టించుకోవడం ఒక క్లిష్టమైన ప్రక్రియలా కాకుండా, సులభంగా పూర్తయ్యే పనిగా మారింది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కంపెనీలు సోలార్ పై అవగాహన కూడా పెంచుతున్నాయి. ఖర్చులు ఎలా ఉంటాయి, బిల్లులు ఎలా తగ్గుతాయి, నెట్ మీటరింగ్ ఎలా పని చేస్తుంది లాంటి విషయాలను సింపుల్ గా explain చేస్తున్నారు. దీని వల్ల వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది, అలాగే సోలార్ వైపు అడుగు వేయడానికి ధైర్యం కూడా వస్తోంది.

భారతదేశ భవిష్యత్తులో సోలార్ ఎనర్జీ ప్రభావం

ఇప్పటికే మన చుట్టూ జరుగుతున్న మార్పులు చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. భారతదేశంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి, కానీ ఆ అవసరాలను సంప్రదాయ విద్యుత్ ఒక్కటే తీరుస్తుందని ఇక చాలామందికి అనిపించడం లేదు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు, సోలార్ ఎనర్జీ ప్రస్తావన తప్పనిసరిగా వస్తోంది.

సోలార్ ఎనర్జీ లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే, మన అవసరానికి తగిన విద్యుత్ ని మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి మీదైనా, బిజినెస్ దగ్గరైనా, ఒకసారి సిస్టమ్ పెట్టుకున్నాక రోజూ విద్యుత్ కోసం grid మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. అదే సమయంలో ఇంధనం దిగుమతి చేసే అవసరం కూడా క్రమంగా తగ్గుతుంది.

ఇంకో కోణంలో చూస్తే, సోలార్ ప్రభావం కేవలం విద్యుత్ వరకే ఆగడం లేదు. విద్యుత్ ఖర్చులు అదుపులోకి రావడం, కొత్త రకాల ఉద్యోగాలు రావడం, దేశంలోనే తయారీ పెరగడం లాంటి మార్పులు కూడా దీనితో పాటు కనిపిస్తున్నాయి. అందుకే సోలార్ ఎనర్జీ ని ఇప్పుడు ఒక ఆప్షన్ గా కాకుండా, రాబోయే కాలానికి అవసరమైన దారిగా చాలామంది చూడటం మొదలుపెట్టారు.

Related Article – What Is the Future of Solar Power? 

భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ పాత్ర

సోలార్ గురించి ఆలోచించే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది రూఫ్‌టాప్ సోలార్. ఎందుకంటే ఇది మన ఇంటి మీదే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇస్తుంది. 

ఇళ్లకు మరియు చిన్న బిజినెస్ లకు రూఫ్‌టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పు మీదే సిస్టమ్ పెట్టించుకోవచ్చు అన్న మాట. రోజూ ఉపయోగించే విద్యుత్ లో కొంత భాగాన్ని తామే ఉత్పత్తి చేసుకోవడం వల్ల కరెంట్ బిల్లుల ఒత్తిడి తగ్గుతుంది. అందుకే అపార్ట్‌మెంట్లు, షాపులు, ఆఫీసులు లాంటి చోట్ల ఇది క్రమంగా సాధారణంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ పాలసీలు, నెట్ మీటరింగ్ లాంటి సదుపాయాలు ఉండటం, అలాగే మొత్తం ప్రాసెస్ కూడా ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా మారడం వల్ల రూఫ్‌టాప్ సోలార్ చాలా మందికి ప్రాక్టికల్ గా ఆలోచించదగిన ఎంపికగా మారింది.

రాబోయే రోజుల్లో భారతదేశ సౌర విద్యుత్ దిశ

రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో సౌర విద్యుత్ వృద్ధి ఇంకా వేగంగా కొనసాగనుంది. ఇప్పుడున్న మార్పులు కేవలం ఆరంభం మాత్రమే.

టెక్నాలజీ అభివృద్ధి, బ్యాటరీ స్టోరేజ్, EV ల వినియోగం ఇవన్నీ కలిసి సోలార్ కు కొత్త ఉపయోగాలను తీసుకువస్తున్నాయి. విద్యుత్ నిల్వ చేయడం సులభమవుతోంది, వినియోగం మరింత పెరుగుతోంది.

ఈ మార్పుల వల్ల నగరాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాలు కూడా లాభపడుతున్నాయి. విద్యుత్ అందుబాటు మెరుగవుతోంది. అదే సమయంలో దేశీయంగా మరియు విదేశాల నుంచి పెట్టుబడులు కూడా సోలార్ రంగం వైపు వస్తున్నాయి. ఇలా చూస్తే, సౌర విద్యుత్ రాబోయే రోజుల్లో భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే విద్యుత్ వనరులలో ఒకటిగా మారుతుందనిపిస్తోంది.

ముగింపు

ఫైనల్ గా చెప్పాలంటే, భారతదేశంలో సౌర విద్యుత్ వృద్ధి అనేది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. ఇది మన విద్యుత్ వినియోగ విధానంలో వస్తున్న పెద్ద మార్పు. విద్యుత్ అవసరాలు పెరగడం, ఖర్చులు అదుపులోకి రావాల్సిన అవసరం, అలాగే సోలార్ చుట్టూ ఏర్పడిన అనుకూల పరిస్థితులు ఇవన్నీ కలిసి ఈ మార్పును ముందుకు నడిపించాయి.

PV మార్కెట్ అభివృద్ధి, ప్రభుత్వ సోలార్ పాలసీలు, తగ్గుతున్న సోలార్ ప్యానెల్ ధరలు, దేశీయ తయారీ లాంటి అంశాలు సోలార్ ను సాధారణ ప్రజలకు చేరువ చేశాయి. రూఫ్‌టాప్ సోలార్ లాంటి పరిష్కారాలు ఇళ్ల స్థాయిలో కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. దీంతో సోలార్ అనేది పెద్ద ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, రోజువారీ జీవితంలో భాగమవుతోంది.

ముందుకు వెళ్లే కొద్దీ, సౌర విద్యుత్ భారతదేశంలో మరింత సహజంగా వినియోగంలోకి వస్తుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన అవగాహనతో, అవసరానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటే సోలార్ వ్యక్తిగతంగా కూడా, దేశ స్థాయిలో కూడా ఉపయోగపడే పరిష్కారంగా నిలుస్తుంది. ఇదే భారతదేశ సౌర విద్యుత్ దిశగా సాగుతున్న ప్రయాణం.

FAQs

Have any specific Question ?

Connect with our solar specialists for personalized guidance.

More Blogs

Connect With Us To Go Solar

    Contact Form

      Connect With Us To Go Solar