మీరు రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఒకటి కాదు, రకరకాల ప్రశ్నలు వస్తాయి. ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొదటి స్టెప్ ఏది, ఎంత ఖర్చు అవుతుంది, నా ఇంటి రూఫ్‌టాప్‌కు ఇది సరిపోతుందా, సరిపోతే ఎంత సామర్థ్యం ఉన్న సిస్టమ్ పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి మనసులో తిరుగుతాయి.
ఇలాంటి ప్రశ్నలకు క్లియర్ సమాధానాలు లేకపోతే నిర్ణయం తీసుకోవడం కష్టం అవుతుంది. ఎవరిని అడగాలి, ఎవరి మాట నమ్మాలి, మన పరిస్థితికి ఏది సరైనది అనే డౌట్ కూడా ఉంటుంది. అందుకే చాలామంది మధ్యలోనే ఆలోచన ఆపేస్తారు.
అందుకే ఈ గైడ్. ఫ్రేయర్ ఎనర్జీతో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ ఎలా జరుగుతుందో, మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు practicalగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ చూద్దాం.
రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టలేషన్ అంటే ఏమిటి?
రూఫ్‌టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పు లేదా బిల్డింగ్ రూఫ్ మీద సోలార్ ప్యానెల్లు పెట్టి, వాటి ద్వారా విద్యుత్ తయారు చేసుకోవడం. ఈ ప్యానెల్లు సూర్యుడు ఉన్నంతసేపు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని తీసుకుని, ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ సహాయంతో మనం రోజూ వాడే విద్యుత్తుగా మార్చుతాయి. ఈ విధానం ఇళ్లలోనే కాదు, షాపులు మరియు చిన్న ఆఫీసుల్లో కూడా వాడుతున్నారు.
ఇన్స్టలేషన్ అంటే, ఈ సోలార్ ప్యానెల్లను రూఫ్ మీద సరిగ్గా అమర్చడం, అవసరమైన భాగాలను కనెక్ట్ చేయడం, మొత్తం సిస్టమ్ పని చేసేలా సెటప్ చేయడం. ఈ స్టెప్స్ అన్నీ క్రమంగా జరిగితేనే సోలార్ సిస్టమ్ సరిగా పనిచేస్తుంది.
రూఫ్‌టాప్ సోలార్ కోసం ఫ్రేయర్ ఎనర్జీ ఎందుకు?
రూఫ్‌టాప్ సోలార్ పెట్టించాలన్నప్పుడు సరైన కంపెనీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫ్రేయర్ ఎనర్జీనే ఎందుకు ఎంచుకోవాలి అంటే, ఫ్రేయర్ ఎనర్జీ భారతదేశంలోని అత్యుత్తమ రూఫ్‌టాప్ సోలార్ కంపెనీలలో ఒకటి. ఇళ్లూ, బిజినెస్‌ల కోసం MNRE-approved సోలార్ సిస్టమ్స్ అందిస్తోంది. 2014 నుంచి లక్షల కస్టమర్లకు ప్రత్యక్ష సేవలు అందిస్తూ, వారి నమ్మకాన్ని సంపాదించుకుంది. అంతే కాకుండా:
- పూర్తి సమాచారం ఒకే చోట
ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ద్వారా సోలార్‌కు సంబంధించిన అన్ని అవసరమైన వివరాలు సులభంగా చూడొచ్చు. మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్ ఉంటే, Freyr Energy App ద్వారా వెంటనే సమాధానం కూడా లభిస్తుంది.
- క్లియర్ మరియు ట్రాన్స్‌పరెంట్ ప్రపోసల్
మీకు ఇచ్చే సోలార్ ప్రపోసల్‌లో సిస్టమ్ డీటైల్స్, భాగాల బ్రాండ్, టైమ్‌లైన్, పేమెంట్ షరతులు అన్నీ స్పష్టంగా ఉంటాయి. యాప్ ద్వారా ఈ వివరాలన్నీ ఎప్పుడైనా చూడవచ్చు, అలాగే ఇన్స్టలేషన్ ప్రోగ్రెస్‌ని కూడా ట్రాక్ చేయొచ్చు.
- హసల్-ఫ్రీ ప్రాసెస్
డిజైన్ నుంచి ఇన్స్టలేషన్, కమిషనింగ్ వరకు మొత్తం ప్రాజెక్ట్‌ని ఫ్రేయర్ ఎనర్జీ టీమ్ చూసుకుంటుంది.
- యాక్టివ్ ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్
సోలార్ సిస్టమ్ ఒకసారి పెట్టించాక చాలా సంవత్సరాలు పనిచేస్తుంది. ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ద్వారా మీ సిస్టమ్ పనితీరు, సేవింగ్స్ అన్నీ సులభంగా ట్రాక్ చేయవచ్చు. అవసరమైనప్పుడు మెయింటెనెన్స్ లేదా క్లీనింగ్ గురించి ముందే నోటిఫికేషన్లు కూడా వస్తాయి.
- డాక్యుమెంట్స్ మరియు వారంటీ సేఫ్‌గా స్టోర్
వారంటీ డాక్యుమెంట్స్ సహా మీ సోలార్ సిస్టమ్‌కు సంబంధించిన ముఖ్యమైన పేపర్స్ అన్నీ యాప్‌లో సేఫ్‌గా సేవ్ అవుతాయి. అవసరమైనప్పుడు వెతకాల్సిన పని ఉండదు.
- నమ్మకమైన అనుభవం మరియు ట్రస్ట్
ఫ్రేయర్ ఎనర్జీ 2014 నుంచి భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్స్ చేస్తోంది. ఇళ్లూ, కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ అవసరాల కోసం సోలార్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసి, ఇప్పటి వరకు 5000కి పైగా సంతృప్తి చెందిన కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించింది. MNRE అప్రూవల్, జాతీయ స్థాయి అవార్డ్స్ ఈ ట్రస్ట్‌కు బలమైన ఆధారం.
ఫ్రేయర్ ఎనర్జీతో సోలార్ ఇన్స్టలేషన్ స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్
Step 1: మీ రూఫ్‌టాప్ మరియు విద్యుత్ అవసరాలు చెక్ చేయడం
సోలార్ ఇన్స్టలేషన్ ప్రారంభించే ముందు ఫ్రేయర్ ఎనర్జీ టీమ్ మీ ఇంటి రూఫ్‌టాప్‌ను పరిశీలిస్తుంది. పైకప్పులో ఎంత ఖాళీ స్థలం ఉంది, సూర్యుడు ఎక్కువగా పడే దిశ ఏది, ఎక్కడైనా షాడో సమస్య ఉందా అనే విషయాలు చూస్తారు. అలాగే మీరు రోజూ ఎంత విద్యుత్ వాడుతున్నారో చూసి, మీ అవసరాలకు సరిపోయే సిస్టమ్‌ను సూచిస్తారు..
Step 2: మీకు సరిపోయే సోలార్ ప్యానెల్, మౌంట్స్ మరియు ఇన్వర్టర్ ఎంపిక
రూఫ్‌టాప్ వివరాలు చూసిన తర్వాత, మీ ఇంటికి సరిపోయే సోలార్ ప్యానెల్ టైప్‌ను ఎంపిక చేస్తారు. దానికి తగ్గట్టు మౌంటింగ్ స్ట్రక్చర్ మరియు ఇన్వర్టర్‌ను కూడా నిర్ణయిస్తారు. ఈ ఎంపిక సరిగ్గా ఉంటేనే సిస్టమ్ బలంగా ఉంటుంది, సేఫ్‌గా పనిచేస్తుంది, అలాగే ఎక్కువ కాలం పనితీరు నిలబడుతుంది.
Step 3: ప్రపోసల్ వివరణ మరియు ఆర్డర్ నిర్దారణ
తర్వాత మీకు ఒక క్లియర్ సోలార్ ప్రపోసల్ షేర్ చేస్తారు. ఇందులో సిస్టమ్ డిజైన్, అంచనా సేవింగ్స్, మొత్తం ఖర్చు, ఉపయోగించే భాగాల వివరాలు అన్నీ ఉంటాయి. ఈ ప్రపోసల్ చూసి మీకు ఏవైనా సందేహాలు ఉంటే అవి క్లియర్ చేస్తారు. మీరు అంగీకరించిన తర్వాత ఆర్డర్ నిర్దారణ జరుగుతుంది.
Step 4: అప్ప్రోవల్స్ మరియు డాక్యుమెంటేషన్ సపోర్ట్
సోలార్ సిస్టమ్ గ్రిడ్‌కు కనెక్ట్ కావాలంటే కొన్ని అనుమతులు అవసరం అవుతాయి. Grid connection, net-metering వంటి ప్రక్రియల్లో ఫ్రేయర్ ఎనర్జీ టీమ్ పూర్తిగా సహాయం చేస్తుంది. డాక్యుమెంటేషన్ విషయంలో కస్టమర్‌కు ఎక్కువ పని లేకుండా ఈ దశను సులభంగా పూర్తిచేస్తారు.
Step 5: సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు కమిషనింగ్
అన్ని సిద్ధమైన తర్వాత ట్రైన్డ్ టెక్నీషియన్లు మీ రూఫ్‌టాప్‌పై సోలార్ ప్యానెల్లను ఇన్స్టాల్ చేస్తారు. మౌంటింగ్ స్ట్రక్చర్, వైరింగ్, ఇన్వర్టర్ అన్నీ నిబంధనలకు అనుగుణంగా అమర్చుతారు. ఇన్స్టలేషన్ పూర్తైన తర్వాత సిస్టమ్‌ను కమిషన్ చేసి, విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా జరుగుతోందో లేదో చెక్ చేస్తారు.
Step 6: వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ మరియు ట్రాకింగ్
ఇన్స్టలేషన్ పూర్తయ్యాక ఫ్రేయర్ ఎనర్జీ ఒక work completion report ఇస్తుంది. ఈ డాక్యుమెంట్ ప్రభుత్వ సబ్సిడీ కోసం చాలా ముఖ్యం. అలాగే Freyr Energy App ద్వారా మీ సోలార్ సిస్టమ్ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది, ఎంత వినియోగం జరుగుతోంది అన్నది సులభంగా ట్రాక్ చేయవచ్చు.
Step 7: సపోర్ట్, వారంటీ మరియు సేఫ్టీ మెజర్స్
ఫ్రేయర్ ఎనర్జీ ఇన్స్టలేషన్‌తోనే ఆగిపోదు. రౌండ్-ది-క్లాక్ సపోర్ట్ అందిస్తుంది. ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్యానెల్లకు వారంటీ assurance ఉంటుంది. అదేవిధంగా సిస్టమ్ సేఫ్‌గా పనిచేయడానికి సరైన earthing మరియు వైరింగ్ ప్రొటెక్షన్ వంటి సేఫ్టీ మెజర్స్ కూడా ఏర్పాటు చేస్తారు.
సోలార్ సబ్సిడీ, ఖర్చు మరియు ధర
భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ వల్ల ప్రారంభ ఖర్చు కొంత తగ్గుతుంది. సబ్సిడీ ప్రక్రియ డాక్యుమెంటేషన్ మరియు అప్రూవల్స్‌తో లింక్ అయి ఉంటుంది, ఇందులో ఫ్రేయర్ ఎనర్జీ టీమ్ సహాయం చేస్తుంది.
సోలార్ ఇన్‌స్టాలేషన్ ఖర్చు మీరు పెట్టించుకునే సిస్టమ్ సామర్థ్యం, వాడే ప్యానెల్లు మరియు ఇన్‌స్టాలేషన్ సెటప్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఇంటికీ లేదా బిజినెస్‌కీ ధర ఒకేలా ఉండదు.
సోలార్ నిర్వహణ మరియు సపోర్ట్
సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత రోజూ ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా సిస్టమ్ సరిగా పనిచేయాలంటే అప్పుడప్పుడూ చిన్న maintenance చేయాలి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్లను శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ప్యానెల్ల మీద దుమ్ము లేదా మట్టి పేరుకుంటే, విద్యుత్ ఉత్పత్తి మీద నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే ఇది తప్పనిసరిగా చూసుకోవాల్సిన విషయం.
ఈ విషయంలో ఫ్రేయర్ ఎనర్జీ కస్టమర్లకు అవసరమైన సపోర్ట్ అందిస్తుంది. Freyr Energy App ద్వారా మీ సిస్టమ్ పనితీరు, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోంది, ఎంత సేవింగ్స్ వస్తున్నాయి అన్నీ సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఏదైనా సమస్య వచ్చినా లేదా మెయింటెనెన్స్ అవసరమన్నా, సపోర్ట్ టీమ్‌ను సంప్రదించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
సరైన సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీ ఎందుకు ముఖ్యం?
రూఫ్‌టాప్ సోలార్ పెట్టించేటప్పుడు ప్యానెల్ క్వాలిటీతో పాటు ఇన్స్టలేషన్ చేసే కంపెనీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సోలార్ సిస్టమ్ ఒకసారి పెట్టించాక ఏళ్ల పాటు పనిచేయాలి. మొదటే సరిగా ప్లాన్ చేయకపోతే తర్వాత సమస్యలు రావడం సహజం.
సరైన సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీ ఉంటే రూఫ్‌టాప్‌ని చూసి, అవసరాలు అర్థం చేసుకుని సరైన సిస్టమ్ సూచిస్తారు. ఇన్స్టలేషన్ సమయంలో సేఫ్టీ మరియు క్వాలిటీపై రాజీ పడరు. అలాగే ఇన్స్టలేషన్ తర్వాత అవసరమైన సపోర్ట్ కూడా అందుతుంది. అందుకే సరైన కంపెనీని ఎంచుకుంటే మొత్తం సోలార్ ప్రయాణం స్మూత్‌గా ఉంటుంది.
ముగింపు
రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ అనేది ఒక్క ప్యానెల్ పెట్టడం మాత్రమే కాదు. సైట్ చెక్ చేయడం నుంచి సరైన సిస్టమ్ ప్లాన్ చేయడం, ఇన్స్టలేషన్, సబ్సిడీ ప్రక్రియ, అలాగే తర్వాత వచ్చే నిర్వహణ వరకు అన్నీ కలిసే ఈ ప్రయాణం. ఈ దశలన్నీ ముందే అర్థమైతే, సోలార్ పెట్టించుకోవడం మీద ఉండే సందేహాలు చాలావరకు తగ్గిపోతాయి.
ఈ మొత్తం ప్రాసెస్‌లో సరైన సోలార్ ఇన్స్టలేషన్ కంపెనీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫ్రేయర్ ఎనర్జీ లాంటి అనుభవం ఉన్న కంపెనీతో ముందుకు వెళ్లితే, ప్రతి స్టెప్ క్లియర్‌గా ఉంటుంది, అవసరమైన సపోర్ట్ కూడా సమయానికి అందుతుంది. అలా సరైన గైడెన్స్‌తో రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టలేషన్ చేసుకుంటే, అది చాలా కాలం పాటు ఉపయోగపడే మంచి నిర్ణయంగా మారుతుంది.