ఇప్పుడు ఇండియాలో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం చాలా పెరిగింది. దాదాపు ప్రతి ఇంటి మీద షాప్ మీద మనకి సోలార్ సెటప్ కనిపిస్తునే ఉంది. ఇది మంచి మార్పు, చాలామందికి ఉపయోగపడే నిర్ణయం కూడా. కానీ సిస్టమ్ పెట్టిన తర్వాత, output అనుకున్నట్టు రాని సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఇన్స్టలేషన్ సమయంలో జరిగే సాధారణ తప్పులు. ఎంత మంచి ప్యానెల్ తీసుకున్నా, అమర్చే విధానం సరిగ్గా లేకపోతే, చివరకు వచ్చే ఫలితం కూడా సరిగ్గా ఉండదు.
ఇన్స్టలేషన్‌లో జరిగే చిన్న పొరపాట్లు వెంటనే కళ్లకు కనిపించకపోయినా, వాటి ప్రభావం రోజూ పవర్ ఉత్పత్తి మీద పడుతుంది. అందుకే సోలార్ సెటప్ గురించి basic అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఇది తెలుసుకోవటం వల్ల చాలా సమస్యలు పెద్దవి కాక ముందే కట్టడి చేయొచ్చు.
కాబట్టి, ఈ blogలో Common Solar Panel Installation Mistakes and How to Avoid Them అనే విషయం గురించి తెలుసుకుందాం.
సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో కనిపించే ప్రధాన తప్పులు

1. సరైన కోణం, దిశ ప్లాన్ చేయకపోవడం
ప్యానెల్స్ ఏ దిశలో ఉన్నాయి, ఏ కోణంలో పెట్టారు అనే విషయాన్ని చాలా మంది మొదట
పట్టించుకోరు. కానీ సోలార్ ప్యానెల్ ఏ దిశలో, ఏ కోణంలో పెట్టారనేదే మొత్తం పనితీరును నిర్ణయిస్తుంది అని మీకు తెలుసా? చాలాసార్లు పైకప్పుపై ఖాళీ ఉన్న చోటే పెట్టేస్తారు. ఇది చాలా మంది చేసే సాధారణ పొరపాటు. ఇలా చేస్తే పవర్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది.
2. షేడింగ్‌ను అండర్‌ఎస్టిమేట్ చేయడం
చాలా మంది పైకప్పుపై పడే నీడను, నీడే కదా అని లైట్ తీస్కుంటూ ఉంటారు. కానీ చెట్లు, ట్యాంక్, పక్క భవనాల వల్ల ప్యానెల్స్ మీద నీడ పడితే, పవర్ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. నీడ చిన్నదే అనిపించినా, దాని ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది
3. Low క్వాలిటీ ఇన్వెర్టర్ /బ్యాటరీ వాడటం
కొంతమంది ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో తక్కువ నాణ్యత గల ఇన్వర్టర్ లేదా బ్యాటరీ తీసుకుంటారు. మొదట్లో బాగానే ఉన్నట్టు అనిపించినా, కొన్ని నెలల్లోనే పవర్ స్టోరేజ్ తగ్గిపోవడం, ఉత్పత్తి సరిగా లేకపోవడం మొదలవుతుంది. సమస్య చాలా సార్లు ప్యానెల్‌లో కాకుండా ఈ పరికరాల్లోనే ఉంటుంది.
4. సరైన wiring, earthing లేకపోవడం
చాలామంది లోకల్ ఎలక్ట్రీషియన్ ని పిలిపించి వైరింగ్ పనిని చేయించుకుంటారు. సోలార్ ప్యానెల్‌కు వచ్చే కరెంట్, ప్యానెల్ నుంచి ఇన్వర్టర్‌కు సరిగ్గా చేరాలంటే వైరింగ్ చాలా బలంగా ఉండాలి. ఇది బలంగా లేకపోతే కరెంట్ దారిలోనే కోల్పోయే అవకాశం ఎక్కువ. అలాగే ఎర్తింగ్ సరిగా లేకపోతే, పరికరాలు ఎక్కువ వేడి చెందడం లేదా damageకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి సరిగ్గా లేకపోతే ప్యానెల్ ఉత్పత్తి ఖచ్చితంగా తగ్గుతుంది.
5. సైట్ సర్వే చేయకుండా సిస్టం సైజు నిర్ణయించటం
సోలార్ ప్యానెల్స్ పెట్టే ముందు ప్యానెల్స్ బరువును రూఫ్ తట్టుకోగలదా, ప్యానెల్స్ పెట్టడానికి సరైన దిశ ఉందా, నీడ ఎక్కువగా పడే ప్రదేశాలు ఉన్నాయా, ఇవన్నీ ముందే గుర్తించాలి. అంటే సైట్ సర్వే చేయించకుండా సిస్టమ్ సైజ్ నిర్ణయిస్తే, మీ రోజు వారి పవర్ అవసరాలకు తగ్గ పవర్ రాదు.
6. అవసరానికి సరిపోయే ప్యానెల్ సైజ్ ఎంచుకోకపోవడం
మీ ఇంట్లో లేదా షాపులో రోజూ ఎంత విద్యుత్ అవసరం అలానే రాబోయే రోజుల్లో వినియోగం పెరిగే అవకాశం ఉందా లెక్కలో లేకుండా solar size ఎంచుకునే వారు చాలా మంది ఉంటారు. ఇవి చూడకుండా సిస్టమ్ సైజ్ నిర్ణయిస్తే పవర్ ఉత్పత్తి తగ్గటమే కాకుండా పెట్టిన return మనం ఆశించినట్టు రావడానికి సమయం ఎక్కువ పడుతుంది.
సోలార్ సిస్టమ్ అమర్చే ముందు పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కారాలు

1. ప్యానెల్స్ దిశ, కోణాన్ని సరిగ్గా పెట్టించుకోవడం
ప్యానెల్స్ దిశ, కోణం సరిగ్గా ఉంటేనే రోజు మొత్తం ఎక్కువ ఎండ అందుతుంది. ఇది ప్లానింగ్ దశలోనే సరిగ్గా fix చేస్తే, పవర్ ఉత్పత్తిలో తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని మొదట్లోనే కరెక్ట్‌గా చూసుకుంటే, తరువాత వచ్చే సమస్యలు చాలా వరకు కనిపించవు. సాధారణంగా సోలార్ పానెల్స్ ని దక్షిణ దిశలో ఇన్స్టాల్ చేస్తే పవర్ ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది
2. నీడ అస్సలు పడని చోటు చూసుకోవడం
ప్యానెల్స్ మీద నీడ పడకుండా ఉండే చోటు ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి water tank, గోడల వల్ల నీడ ఎక్కడ పడుతుంది అనేది తెలియదు. దీనికి నిపుణుల సహాయం చాలా అవసరం. వాళ్లు మీరు సోలార్ సెటప్ ని ఇన్స్టాల్ చేయించుకోవాలని చోటుని సర్వే చేసి, నీడ ఎక్కువగా పడే భాగాలను గుర్తించి, వాటికి సరిపోయే మార్పులు సూచిస్తారు.
3. మంచి క్వాలిటీ ఇన్వర్టర్, బ్యాటరీ ఎంపిక
సోలార్ సిస్టమ్‌లో పవర్ నిల్వ ఉండాలి అంటే ఇన్వర్టర్, బ్యాటరీ మంచి నాణ్యతలో ఉండటం చాలా అవసరం. Backup కూడా ఎక్కువసేపు నిలబడుతుంది. తక్కువ నాణ్యత ఉన్నవి తీసుకుంటే power load వచ్చినప్పుడు system struggle అవుతుంది. అందుకే కొనేటప్పుడు ధర కన్నా పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
4. రూఫ్ సర్వే చేయడం
ప్యానెల్స్‌కి ఎక్కడ ఎక్కువ ఎండ వస్తుంది, బరువును roof తట్టుకుంటుందా, నీడ లేని భాగం ఏది, ఇవన్నీ సర్వే ద్వారా స్పష్టంగా తెలుస్తాయి. సర్వే చేయకుండా సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటే output తక్కువగా రావచ్చు. దీన్ని skip చేస్తే తర్వాత power లోటు కనిపిస్తుంది.
5. వైరింగ్, ఎర్తింగ్ పక్కాగా చేయించడం
సోలార్ సిస్టమ్‌లో power loss లేకుండా ఇంట్లో కరెక్ట్‌గా చేరాలంటే వైరింగ్ బలంగా ఉండాలి. ఎర్తింగ్ కూడా సేఫ్‌గా సెట్ చేస్తేనే ఇంటికి, సిస్టమ్‌కి రక్షణ ఉంటుంది. సోలార్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న టెక్నీషియన్ అయితే ఈ రెండింటిని కరెక్ట్ గా చూసుకుని చేస్తారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు .
6. మీ వినియోగానికి సరిపోయే సిస్టమ్ సైజ్ పెట్టించడం
ఇంట్లో లేదా షాప్‌లో రోజు వాడే పరికరాల పవర్ లోడ్ తో పాటు ఫ్యూచర్ లో ఒకవేళ ఇంకా ఏవైనా వస్తువులు తీసుకునే ఆలోచన ఉంటే వాటి పవర్ లోడ్ కూడా పరిగణ లోకి తీసుకుని పవర్ లోడ్ ని ముందే లేకిస్తేనే solar system plan సరిగ్గా సెట్ అవుతుంది. ఆలా చేస్తే మోటార్, ఫ్యాన్స్, లైట్స్ ఒకేసారి నడిచినా కూడా system ఇబ్బంది లేకుండా పని చేస్తుంది. ఈ లెక్కలు ముందు నుంచే ఉండటం వల్ల ఫ్యూచర్ లో పవర్ సరిపోదేమో అనే భయం ఉండదు
సోలార్ ఫలితం సెటప్‌లో మొదలు
సోలార్ పెట్టుకోవడం నిజంగా స్మార్ట్ నిర్ణయం. కరెంట్ బిల్ తక్కువగా వస్తే చాల రిలీఫ్ గా ఉంటుంది. కానీ ఎంత మంచి సిస్టం తీసుకున్నా, ఇన్స్టలేషన్ సరిగా లేకపోతే output అనుకున్నట్టు రాదు.
చాల మంది సోలార్ పెట్టించుకోవాలనే excitement లో, ప్లానింగ్ మీద ఫోకస్ చేయకుండా పెట్టించేస్కుంటారు. పైన చెప్పిన తప్పులు జరగటం వల్ల అనుకున్న ఔట్పుట్ రాకపోగా మీరు సోలార్ పెట్టించుకున్నందుకు ఉపయోగం ఉండదు.
అప్పుడు అనిపిస్తుంది అరెరే ముందే మనం నిపుణులు తో మాట్లాడి ఇన్స్టాల్ చేయించుకుంటే బావుండేది అని. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటది. కాబట్టి మీరు సోలార్ పెట్టించుకోవాలి అని ఆలోచన ఒచ్చినప్పుడే Freyr Energy లాంటి సోలార్ ఎక్స్పర్ట్స్ సహాయం తీసుకుని ఇన్స్టలేషన్ చేయించుకుంటే output తగ్గటం వంటి సమస్యలను తగ్గించవచ్చు.