మీ ఇంటికి సరైన సోలార్ పవర్ సిస్టమ్ ఎలా ఎంచుకోవాలి? - Freyr Energy

మీ ఇంటికి సరైన సోలార్ పవర్ సిస్టమ్ ఎలా ఎంచుకోవాలి?

ఇప్పుడు విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇళ్ళు, ఫ్యాక్టరీలు, వ్యవసాయరంగం – అన్నింటికీ ఎక్కువ విద్యుత్ అవసరం అవటం వలన అధికంగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. ఫలితంగా, భూమి నుండి మరిన్ని సహజ వనరులను (ఫాసిల్ ఫ్యూల్స్) ఉపయోగించడం జరుగుతోంది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తోంది.

దీని పరిష్కారం, సోలార్ ఎనర్జీ వైపు మారడం. సూర్యుని కాంతిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల, పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీని వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలో సోలార్ పవర్ ప్లాంట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే, మీ ఇంటికి సరైన సోలార్ పవర్ ప్లాంట్ ఎంచుకోవడం కొంత కష్టమైన ప్రక్రియ. అందుకే, ఈ బ్లాగ్‌లో మీరు సరైన సోలార్ సిస్టమ్‌ను ఎంపిక చేసే విధానాన్ని తెలుసుకుంటారు. ఏయే రకాల సోలార్ పవర్ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయో, మీ ఇంటికి ఏది సరిపోతుందో తెలుసుకుని, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ బ్లాగ్ మీకు సహాయపడుతుంది.

 

మీ ఇంటికి సరైన సోలార్ పవర్ సిస్టమ్ ఎంచుకోవడానికి 5 ముఖ్యమైన విషయాలు

సోలార్ సిస్టమ్ పెట్టడం ఒక మంచి పెట్టుబడి. అయితే, సరైన వ్యవస్థను ఎంచుకోవాలి. లేదంటే, తక్కువ సామర్థ్యం కలిగిన లేదా ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే, కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణించాలి.

అవి ఏంటో ఇప్పడు చూద్దాం.

1. మీకు అవసరమైన విద్యుత్ సామర్థ్యం

ముందుగా మీ ఇంటికి రోజూ ఎంత యూనిట్ల విద్యుత్ అవసరమో అంచనా వేయాలి. ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఏసీ, లైట్లు – ఇవన్నీ కలిపి రోజుకు ఎంత యూనిట్లు వినియోగిస్తున్నారో తెలుసుకుని, దాని ఆధారంగా సరైన సామర్థ్యం (kW) గల సోలార్ సిస్టమ్ ఎంచుకోవాలి.

2. సోలార్ పవర్ ప్లాంట్ రకాలు

సోలార్ సిస్టమ్ మూడు రకాలుగా ఉంటాయి: ఆన్-గ్రిడ్, ఆఫ్-గ్రిడ్, హైబ్రిడ్.

  • ఆన్-గ్రిడ్ – డిస్కమ్ (Electricity Board) కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.
  • ఆఫ్-గ్రిడ్ – బ్యాటరీలో విద్యుత్ నిల్వ చేసుకునే విధంగా పనిచేస్తుంది.
  • హైబ్రిడ్ – ఈ రెండింటి కలయిక. మీ అవసరానికి అనుగుణంగా సరైన రకాన్ని ఎంచుకోవాలి.

3. సోలార్ ప్యానెల్స్ నాణ్యత

సోలార్ ప్యానెల్స్ దీర్ఘకాలం ఉపయోగపడాలి. కాబట్టి, మార్కెట్లో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్న ప్యానల్స్ ని ఎంచుకోవటం చాలా ముఖ్యం. మోడ్యూలర్ మరియు మానోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ వారంటీ, ప్రామాణికత చూడటం కూడా అవసరం.

4. ఇన్‌వర్టర్ మరియు బ్యాటరీ సామర్థ్యం

సోలార్ ఇన్‌వర్టర్ ప్రధాన భాగం. ఇది సోలార్ ఎనర్జీని వినియోగించదగిన ఫార్మాట్‌లోకి మార్చుతుంది. మంచి సామర్థ్యం ఉన్న ఇన్‌వర్టర్ ఎంచుకోవాలి. బ్యాటరీ అవసరమా లేదా అనేది మీ సిస్టమ్ రకం మీద ఆధారపడి ఉంటుంది.

5. స్థాపన ఖర్చు మరియు రక్షణ

సోలార్ పవర్ ప్లాంట్ మొదట ఖర్చుతో కూడినదే అయినా, దీర్ఘకాలంలో అది ఆదాయం తీసుకువస్తుంది. అయితే, మంచి సంస్థ ద్వారా స్థాపన చేయించుకోవడం ముఖ్యం. అలాగే, కాలక్రమేణా మురికిని శుభ్రం చేయడం, సాంకేతికత అప్‌డేట్ చేయడం లాంటి నిర్వహణ అవసరం.

ఈ విషయాలను గమనించి, మీ ఇంటికి సరైన సోలార్ సిస్టమ్ ఎంచుకుంటే, దీర్ఘకాలం లాభాలను పొందవచ్చు.

సోలార్ పవర్ సిస్టమ్ కోసం సరైన కంపెనీని ఎలా ఎంచుకోవాలి?

సోలార్ సిస్టమ్ కొనుగోలు చేయడం పెద్ద పెట్టుబడి. అందుకే, నాణ్యమైన ఉత్పత్తులు, మంచి సేవలు అందించే కంపెనీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన కంపెనీని ఎంచుకోవడంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

1. కంపెనీ విశ్వసనీయత

సోలార్ కంపెనీ గతంలో ఎన్ని ప్రాజెక్టులు చేసిందో తెలుసుకోవాలి. వారి కస్టమర్ రివ్యూలు, రేటింగ్‌లు, మరియూ మార్కెట్‌లో వారి పేరు పరిశీలించడం మంచిది.

2. ప్రామాణిక ఉత్పత్తులు

అందించే సోలార్ ప్యానెల్స్, ఇన్‌వర్టర్, బ్యాటరీ – ఇవన్నీ BIS, MNRE వంటి ప్రమాణాలతో ఉండాలని చూడాలి. తక్కువ నాణ్యత గల ఉత్పత్తులు తీసుకుంటే పనితీరు తగ్గిపోతుంది.

3. వారంటీ & సర్వీస్ సపోర్ట్

సోలార్ ప్యానెల్స్‌కు 20-25 ఏళ్ల వరకు వారంటీ ఉంటుంది. కానీ, ఇన్‌వర్టర్ మరియు బ్యాటరీలకు తక్కువ ఉంటుంది. కంపెనీ ఇబ్బందుల సమయంలో సపోర్ట్ అందిస్తుందా లేదా తెలుసుకోవాలి.

4. ఇన్‌స్టలేషన్ మరియు మెయింటెనెన్స్

కొందరు కంపెనీలు సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్ మాత్రమే చేస్తాయి, మరికొందరు దీర్ఘకాలం మెయింటెనెన్స్ సేవలు కూడా అందిస్తారు. మీకు ఏది అవసరమో నిర్ణయించుకొని ఎంపిక చేసుకోవాలి.

5. ధర మరియు సబ్సిడీలు

సోలార్ సిస్టమ్ ధర కంపెనీలను బట్టి మారుతుంటుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలను తెలుసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేలా ప్లాన్ చేసుకోవాలి.

సోలార్ పవర్ ప్లాంట్ కోసం సరైన కంపెనీని ఎంచుకుంటే, మీరు మంచి సేవలు పొందడంతో పాటు దీర్ఘకాలం ఖర్చులు తగ్గించుకోవచ్చు.

ముగింపు

సరైన సోలార్ పవర్ సిస్టమ్‌ను ఎంచుకోవడం ద్వారా, మీ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా పొందడమే కాకుండా, విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చు. పర్యావరణ హితంగా ఉండే ఈ పరిష్కారం, భవిష్యత్ తరాలకు శుభప్రదమైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుంది. సరైన సిస్టమ్ ఎంపిక చేయడం, నాణ్యమైన సంస్థను ఎంచుకోవడం, మరియు సమయానుకూల నిర్వహణ చేయడం ద్వారా, సోలార్ ఎనర్జీ ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.

Freyr Energy, మీకు విశ్వసనీయ భాగస్వామి అవ్వగలదు. 2014 నుండి,  భారతదేశంలో 8000 కంటే ఎక్కువ కస్టమర్లకు సేవలందించి, వారికి సంతృప్తిని అందించింది. MNRE తో ఎంపానెల్డ్ అయిన ఈ సంస్థ, Freyr Energy App ద్వారా సులభమైన సోలార్ అనుసంధాన అనుభవాన్ని అందిస్తుంది. 24×7 సేవా మద్దతు, సున్నా-ఖర్చు EMI ఎంపికలు, మరియు నాణ్యమైన ఇన్‌స్టలేషన్ సేవలతో, ఫ్రేయర్ ఎనర్జీ మీ ఇంటికి సరైన సోలార్ పవర్ సిస్టమ్ ఎంపిక నుండి స్థాపన వరకు సమగ్ర సహాయాన్ని అందిస్తుంది.

FAQs

Have any specific Question ?

Connect with our solar specialists for personalized guidance.

More Blogs

Connect With Us To Go Solar


Contact Form